: శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గీతారెడ్డి


తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి గీతారెడ్డి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న మంత్రి దంపతులకు టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు గీతారెడ్డి దంపతులకు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు.

  • Loading...

More Telugu News