: నేడు ప్రధానమంత్రితో సీమాంధ్ర కేంద్రమంత్రుల భేటీ
రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర ప్రాంతంలో చేపట్టాల్సిన చర్యల గురించి కేంద్ర ప్రభుత్వానికి వివరించే క్రమంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఈ రోజు మధ్యాహ్నం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను కలవనున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రుల బృందానికి సమర్పించిన ఆరు పేజీల డిమాండ్లను ప్రధాన మంత్రికి అందించి వాటిని నెరవేర్చాలని కోరనున్నారు. సీమాంధ్ర ప్రజలు కొంతమేరకైనా సంతృప్తి చెందాలంటే హైదరాబాద్ ను ఢిల్లీ తరహాలో కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని వారు ప్రధానికి వివరించనున్నారు.