: వెనిజులా గొప్పనేతను కోల్పోయింది: ప్రధాని మన్మోహన్
అధ్యక్షుడు హ్యూగో చావెజ్ మరణంతో వెనిజులా ఓ గొప్పనేతను కోల్పోయిందని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. చావెజ్ మృతి పట్ల ప్రధాని తన సంతాపం వ్యక్తం చేశారు. చావెజ్ అత్యంత జనాకర్షణ ఉన్న నాయకుడని కొనియాడారు. కమ్యూనిస్టు సిద్దాంతాల పునాదిపై సామాజిక న్యాయం దిశగా పోరాటం చేసిన వారిలో చావెజ్ అగ్రగణ్యుడని మన్మోహన్ కితాబిచ్చారు.