: ఈ కారు గుండెపోటును పసిగడుతుంది!
కారు గుండెపోటును పసిగట్టడం ఏంటి... అదేమన్నా డాక్టరా... అని మీకు సందేహం వచ్చిందా... అంటే ఆ కారును అలా డిజైన్ చేశారు. కారును నడిపే వ్యక్తికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటే దాన్ని ముందుగా గుర్తించి ఈ కారు హెచ్చరిస్తుంది.
జపాన్‌కు చెందిన పరిశోధకులు ఒక కొత్తరకం కారును అభివృద్ధి చేశారు. ఈ కారు డ్రైవింగ్ చేసే వ్యక్తికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటే దాన్ని ముందుగానే పసిగట్టి హెచ్చరిస్తుంది. ఈ విధంగా ఈ కారుకు చెందిన స్టీరింగ్, డ్రైవర్ సీటులో కొన్ని సెన్సర్లను ఏర్పాటు చేశారు. ఈ సెన్సర్లు కారు నడిపే వ్యక్తి నాడిని పసిగడతాయి. తర్వాత ఈ సెన్సర్లు కారులో ఉండే ఎలక్ట్రిక్ పోల్స్‌కు రక్త సరఫరాకు సంబంధించిన సమాచారాన్ని పంపుతాయి. దీంతో కారును నడిపే వ్యక్తి గుండె కొట్టుకునే తీరు తెలుస్తుంది. హృదయస్పందనల్లో ఏవైనా తేడాలు వస్తే ఈ ఎలక్ట్రిక్ పోల్స్ వెంటనే హెచ్చరిస్తాయి. కారును వెంటనే పక్కకు తీసుకెళ్లి ఆపమని చెబుతాయి. ఈ వ్యవస్థను వీలైనంత త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని పరిశోధకుల్లో ఒకరైన నిప్పాన్ వైద్య పాఠశాల ప్రొఫెసర్ టకావో కటో చెబుతున్నారు.