: మా తరంలో సచినే బెస్ట్ : షేన్ వార్న్
తమ తరం క్రికెటర్లలో సచినే గొప్ప ఆటగాడని... అతన్ని మించిన ఆటగాడిని తాను చూడలేదని ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ షేన్ వార్న్ అన్నాడు. టెస్టు, వన్డే క్రెకెట్ ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేయడమే కాకుండా... వందకు పైగా సెంచరీలు చేయడం మామూలు విషయం కాదని చెప్పాడు. రానున్న రోజుల్లో కూడా సచిన్ లాంటి ఆటగాడు లభించడం మామూలు విషయం కాదని తెలిపాడు. విభిన్న పరిస్థితుల్లో అన్ని రకాల బౌలింగ్ లను సచిన్ దీటుగా ఎదుర్కొన్నాడని అన్నాడు. భారత ప్రేక్షకుల నుంచి అంతులేని ఒత్తిడిని ఎదుర్కొంటూ కూడా... సచిన్ తన పాత్రను విజయవంతంగా పోషించాడని కితాబిచ్చాడు. తాను సచిన్ 200వ టెస్ట్ మ్యాచ్ కు హాజరవుతానని వార్న్ అన్నాడు.