: జార్ఖండ్ రాజధాని రాంచీని రక్షించిన ఫైలిన్ తుపాను


ఇటీవల వచ్చిన ఫైలిన్ తుపాను వల్ల జార్ఖండ్ రాజధాని రాంచీకి మేలు జరిగింది. ఈ తుపాను రాంచీని పెద్ద ఉపద్రవం నుంచి బయటపడేసింది. ఉగ్రవాదులు దుర్గా పూజ సందర్భంగా రాంచీలో వరుస బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మధ్య జాతీయ దర్యాప్తు సంస్థ, జార్ఖండ్ పోలీసులు రాంచీలోని ఓ లాడ్జీపై దాడి చేసి 9 బాంబులు, 14 డిటోనేటర్లు, 12 టైమర్లు, 25 జిలెటన్ స్టిక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దుర్గా పూజ సందర్భంగా రాంచీలో ఈ బాంబులను పేల్చేందుకు సిద్ధం చేసినట్టు ఓ పోలీసు అధికారి చెప్పారు .

దుర్గా పూజ సందర్భంగా ప్రజలు పూజా కార్యక్రమాల్లో భారీగా పాల్గొంటారు. అయితే ఆ సమయంలో తుపాను కారణంగా రాంచీలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురవడంతో ప్రజలు బయటకు రాలేకపోయారు. దీంతో ఉగ్రవాదులు పన్నిన పన్నాగం విఫలమై రాంచీ పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది.

  • Loading...

More Telugu News