: అసెంబ్లీలో తప్పనిసరిగా తీర్మానం ప్రవేశ పెట్టాలి: యనమల


అసెంబ్లీలో తప్పనిసరిగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తీర్మానం జరిగాకే కేంద్రం పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని అన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేయకుండా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. అంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956 లో ఏర్పడ్డప్పుడు కూడా ఆంధ్ర, హైదరాబాద్ రెండు రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానం జరిగిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే తాము ఎక్కడ ఉండాలన్నది భద్రాచలం ప్రజలే నిర్ణయించుకుంటారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News