: తెలుగు వారి ఆత్మగౌరవాన్ని సీమాంధ్ర కేంద్రమంత్రులు తాకట్టు పెట్టారు: వాసిరెడ్డి పద్మ
తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని సీమాంధ్ర కేంద్ర మంత్రులు తాకట్టు పెట్టారని వైయస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. విభజన విషయంలో సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు తెలుగు బిడ్డల్లా కాకుండా ఇటాలియన్ బిడ్డల్లా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు ఇంత మంది ఉండి కూడా విభజనను అడ్డుకోలేకపోవటం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని గతంలో భీష్మ ప్రతిజ్ఞలు చేసిన వీరు ఏ గాలికి కొట్టుకుపోయారని ఆమె ఎద్దేవా చేశారు.