: శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు మన్మోహన్ లేఖ
శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ రోజు ఒక లేఖ రాశారు. కామన్వెల్త్ దేశాల సదస్సుకు గైర్హాజరుపై కారణాలు వివరిస్తూ ఆయన ఈ లేఖ రాశారు. శ్రీలంక రాజధాని కొలంబోలోని భారత హైకమిషనర్ కార్యాలయం ఈ లేఖను ఆ దేశాధ్యక్షుడికి అందజేస్తుంది.