: కాకినాడలో భారీ అగ్ని ప్రమాదం.. 50 ఇళ్లు దగ్ధం
తూర్పుగోదావరి జిల్లా కాకినాడులో ఈ రోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడి ప్రతాప్ నగర్ వంతెన సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 50 ఇళ్లు కాలిపోయాయి. ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రజలు తలోదిక్కుకి పరుగులు తీశారు.
మంటలు మరింతగా వ్యాపిస్తుండడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.