: ధోనీ నాయకత్వాన్ని గుర్తించింది సచినే: శరద్ పవార్


ధోనీలో నాయకత్వ లక్షణాలున్నాయని ముందుగా గుర్తించింది విఖ్యాత క్రికెటర్ సచిన్ టెండుల్కరేనని కేంద్ర మంత్రి శరద్ పవార్ చెప్పారు. 2007లో టీమిండియా కెప్టెన్ పదవికి ధోనీ పేరును ప్రతిపాదించింది సచినేనని తెలిపారు. 'నేను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండగా.. కెప్టెన్సీ నుంచి వైదొలగాలని అనుకుంటున్నానని ద్రవిడ్ నాకు ఒక రోజు చెప్పాడు. కెప్టెన్ గా సచిన్ పేరు ప్రతిపాదించాడు. కానీ, కెప్టెన్ బాధ్యతలను చేపట్టేందుకు సచిన్ నిరాకరించాడు. బదులుగా ధోనీకి ఆ అవకాశం ఇస్తే మంచి ప్రతిభ చూపగలడన్నాడు' అంటూ నాటి విషయాలను పవార్ తాజాగా తన బ్లాగులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News