: నారా లోకేష్ తెలంగాణ నుంచే పోటీ చేయాలి : తెదేపా నేత నర్సారెడ్డి
చంద్రబాబు తనయుడు లోకేష్ తెదేపా పార్టీ పగ్గాలు చేపడితే... రెడ్ కార్పెట్ వేసి అతనికి ఆహ్వానం పలుకుతామని తెలంగాణ తెదేపా నేత నర్సారెడ్డి అన్నారు. లోకేష్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే... తెలంగాణ ప్రాంతం నుంచే పోటీ చేయాలని కోరుతున్నామని తెలిపారు. నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బడుగు, బలహీన వర్గాలకు మేలు జరగాలంటే... టీడీపీ, చంద్రబాబు కుటుంబం అండ అవసరమని నర్సారెడ్డి తెలిపారు.