: సినిమా అవకాశాలపై మిషెల్లే శిక్షణ కార్యక్రమం
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్లే ఒబామాలో బాలీవుడ్ డాన్స్ మార్పు తీసుకొచ్చింది. దీపావళి పండుగ రోజు బాలీవుడ్ డాన్స్ తో మిషెల్లే ఊగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాణంలో ఉన్న అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మిషెల్లే వైట్ హౌస్ లో శుక్రవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాషింగ్టన్, న్యూయార్క్, బోస్టన్ ప్రాంతాల విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. యానిమేషన్, స్పెషల్ ఎఫెక్ట్స్, మేకప్, కాస్ట్యూమ్స్, డైరెక్షన్, మ్యూజిక్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఇందులో ప్రఖ్యాత దర్శకులు, సినీరంగ నిపుణులు పాల్గొన్నారు.