: గాయాలతో సతమతమౌతున్న విండీస్ టీం
భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ క్రికెట్ జట్టును... ఆటగాళ్ల గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే భుజం నొప్పితో పేస్ బౌలర్ కెమర్ రోచ్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. తాజాగా, గాయంతో బాధపడుతున్న విండీస్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ ను వన్డేలకు కూడా దూరంగా ఉంచారు. కీలకమైన వీరిరువురూ గాయాలతో ఆటకు దూరమవడంతో... విండీస్ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే విండీస్ జట్టు తొలి టెస్టు మ్యాచ్ ను కోల్పోయింది. పర్యటనలో భాగంగా, వెస్టిండీస్ మరో టెస్టు మ్యాచ్, మూడు వన్డేలు ఆడనుంది.