: 10వేల మందిని కబళించిన ప్రళయ తుపాను!


ఫిలిప్పీన్స్ పై ప్రళయ తుపాను హయాన్ విరుచుకుపడింది. సెంట్రల్ ప్రావిన్స్ లైటేను తుడిచిపెట్టేసింది. సుమారు 10 వేల మందిని కబళించినట్లు అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని ఒక పోలీసు అధికారి చెప్పారు. లైటే ప్రాంతం 80 శాతం దెబ్బతింది. తీర ప్రాంతాలు శవాల గుట్టలుగా మారాయి. టాల్కోబాన్ పట్టణంలో తీరం పొడవునా కిలోమీటరు పాటు శవాలు పడి ఉన్నట్లు సమాచారం.

శక్తిమంతమైన అలలతో తీర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఇప్పటి వరకు వచ్చిన భీకర మృత్యు తుపానులలో హయాన్ ఒకటిగా భావిస్తున్నారు. తాము గతరాత్రి నిర్వహించిన సమావేశంలో 10 వేల మంది మృత్యువాత పడినట్లు గవర్నర్ ప్రకటించారని రీజినల్ పోలీస్ డైరెక్టర్ ఎల్మర్ సోరియా చెప్పారు. ఫిలిప్పీన్స్ పై పంజా విసిరిన తర్వాత హయాన్ మృత్యు గర్జనతో వియత్నాం దిశగా కదిలిపోయింది.

  • Loading...

More Telugu News