: రామదాసు నిర్మించిన భద్రాచలం ఆలయాన్ని వదులుకోం: టీఆర్ఎస్వీ


భద్రాచలాన్ని ఆంధ్ర ప్రాంతంలో కలిపేయాలని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ సూచించడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (టీఆర్ఎస్వీ) తీవ్రంగా తప్పుబట్టింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన కంచర్ల గోపన్న(భక్తరామదాసు) భద్రగిరిపై రామయ్యకు ఆలయాన్ని కట్టించారని, అ ప్రాంతాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోబోమని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు అన్నారు. ఈ మేరకు టీఆర్ఎస్వీ విద్యార్థులు నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఆందోళన నిర్వహించారు.

  • Loading...

More Telugu News