: సాయిబాబా మందిరంలో చోరీ
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఉన్న షిరిడీ సాయిబాబా మందిరంలో నిన్న రాత్రి దొంగతనం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం, మందిరం వెనుకవైపున్న కిటికీలను తొలగించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. అరకిలో వెండి, రెండు హుండీలలో ఉన్న నగదును దొంగలు అపహరించుకుపోయారు. ఈ రోజు ఉదయం ఆలయంలో దొంగతనం జరిగినట్టు గుర్తించిన దేవాలయ నిర్వాహకులు... సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని, దర్యాప్తును ప్రారంభించారు.