: ఆంధ్రప్రదేశ్ విభజనకు మేం వ్యతిరేకం : జేడీయూ, ఏజీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), అసోం గణపరిషత్ (ఏజీపీ)లు ప్రకటించాయి. రాష్ట్ర విభజనకు తాము మద్దతు ఇవ్వమని తెలిపాయి. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ రోజు విశాలాంధ్ర మహాసభ చేపట్టిన 'ఢిల్లీ ముట్టడి' కార్యక్రమంలో ఆ పార్టీల ప్రతినిధులు పాల్గొని మద్దతు తెలిపారు.