: సీఎంను భర్తరఫ్ చేయాలి : నాగం
సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకిస్తున్న సీఎం కిరణ్ ను భర్తరఫ్ చేయాలని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. అధిష్ఠానాన్ని ముఖ్యమంత్రి ధిక్కరిస్తున్నా... ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సీఎంను తప్పించి... రాష్ట్రపతి పాలన పెట్టైనా సరే రాష్ట్ర విభజన చేయాలని అన్నారు. రాష్ట్ర విభజనకు కిరణ్ అంగీకరించారని దిగ్విజయ్ చెబుతుంటే... తాను ఇప్పటికీ సమైక్యవాదినే అంటూ సీఎం చెబుతున్నారని మండిపడ్డారు.