: టీటీడీకి సమాచార హక్కు కమిషన్ నోటీసు


తిరుమల తిరుపతి దేవస్థానానికి రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ నోటీసు ఇచ్చింది. తిరుమల ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాల వివరాలు తెలపాలంటూ కొన్ని రోజుల కిందట భక్తుడు ప్రసాద్ దరఖాస్తు చేసుకున్నాడు. అయినా, వివరాలు వెల్లడించకపోవడంతో భక్తుడు ప్రసాద్ సమాచార హక్కు కమిషన్ ను ఆశ్రయించాడు. స్పందించిన కమిషన్.. ఈ నెల 13న వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరుకావాలని టీటీడీ జేఈవోకు నోటీసులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News