: అనంతపురం జిల్లా రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నార్పల నుంచి బత్తపల్లికి వెళ్లే ఆటోను ఎదురుగా వచ్చిన వ్యాను ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. చనిపోయిన వారిలో ఆటో డ్రైవర్ కూడా ఉన్నాడు. క్షతగాత్రులను బత్తలపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.