: పోలీసులు అప్రమత్తంగానే ఉన్నారు: హైదరాబాద్ కమిషనర్ అనురాగ్ శర్మ


కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో తాము అప్రమత్తంగానే ఉన్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. శివరాత్రి సందర్బంగా ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు యత్నించవచ్చని ఈ ఉదయం కేంద్రం రాష్ట్రాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

అంతేగాకుండా నేడు, రేపు అప్రమత్తంగా ఉండాలని కూడా కేంద్రం సూచించింది. కేంద్రం ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. వ్యాపార సంస్థలతో కలిసి 600 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని కమిషనర్ అన్నారు.

రద్దీగా ఉండే ప్రాంతాలతోపాటు దేవాలయాల వద్ద భారీ ఎత్తున తనిఖీలు చేపట్టినట్టు అనురాగ్ శర్మ తెలిపారు. ఇక పేలుళ్ల ఘటనకు సంబంధించి తాము స్వాధీనం చేసుకున్నఆధారాలను ఎన్ఐఏకి ఇచ్చామని ఆయన వెల్లడించారు. 

  • Loading...

More Telugu News