: భర్తను చితకబాదిన మహిళా ఎమ్మెల్యే
ఉత్తర ప్రదేశ్ లో ప్రజాప్రతినిధుల అరాచకాలకు అంతు లేకుండా పోతోంది. తాజాగా ఓ మహిళా ఎమ్మెల్యే తన అంగరక్షకులతో కలసి భర్తను చితకబాదిన ఘటన వెలుగులోకి వచ్చింది. చాండౌసీ ఎమ్మెల్యే లక్ష్మీ గౌతమ్ విభేదాల కారణంగా భర్త దిలీప్ వర్షనెకు దూరంగా ఉంటున్నారు. శుక్రవారం రాత్రి లక్ష్మీ గౌతమ్ తన గన్ మన్, ఇతర సహాయకులతో కలిసి తన ఇంటిపైకి వచ్చి... తనపై దాడి చేసినట్టు దిలీప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వృద్ధురాలైన తన తల్లిని దూషించడంతో పాటు ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా తనను బెదిరించినట్టు ఆయన తెలిపారు.