: సీఎం ఇంకెంతో కాలం మాట్లడలేరు : షబ్బీర్ ఆలీ
వరంగల్ లో జరుగుతున్న అభినందన సభలో షబ్బీర్ అలీ సీఎంపై మండిపడ్డారు. తెలంగాణపై సీఎం మాటలు ఇంకొన్ని రోజులు మాత్రమే ఉంటాయని షబ్బీర్ ఆలీ అన్నారు. ఆయన ఆటలు ఇంకెంతో కాలం కొనసాగవని చెప్పారు. సీడబ్ల్యూసీ నిర్ణయానికి ఎవరూ అతీతులు కారని తెలిపారు. డిసెంబర్ లోగా తెలంగాణ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. సీమాంధ్ర ఎంపీలు ఛాలెంజ్ చేస్తే... దానికి దీటుగా సమాధానమిస్తామని అన్నారు. తెలంగాణకు మొదట అన్ని పార్టీలు అంగీకారం తెలిపాయని... మధ్యలో యూ టర్న్ తీసుకున్నాయని షబ్బీర్ విమర్శించారు. జగన్ కు సోనియా గురించి మాట్లాడే అర్హత లేదని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికే... రాష్ట్ర ఏర్పాటుకు సోనియా సిద్ధమయ్యారని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.