: ఛత్తీస్ గఢ్ ను అభివృద్ధి చేయడంలో బీజేపీ విఫలం : ప్రధాని


ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఛత్తీస్ గఢ్ ను అభివృద్ధి చేయడంలో, శాంతి భద్రతల కల్పనలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. బీజేపీ పాలనలో ఛత్తీస్ గఢ్ లో రక్షణ లేకుండా పోయిందన్న ప్రధాని, ఇక్కడ శాంతి భద్రతల సమస్య తీవ్రంగా ఉందన్నారు. బీజేపీ మాదిరిగా కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలు చేయదని మన్మోహన్ వ్యాఖ్యానించారు. మావోయిస్టుల బెదిరింపులకు కాంగ్రెస్ బెదరదన్నారు. ఆయుధాలు వీడితేనే అభివృద్ధి సాధ్యమని ప్రధాని పేర్కొన్నారు. ఛత్తీస్ ఘడ్ లో పీడీఎస్ పథకం అమలు ఘనత కాంగ్రెస్ కే చెందుతుందన్నారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన ఆహార భద్రత చట్టం చరిత్రాత్మకమన్నారు. కేంద్రం కేటాయించిన నిధులను రాష్ట్రం సరిగా ఉపయోగించుకోవడం లేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News