: వరద సాయంగా ఏపీ, ఒడిశాకు చెరో వెయ్యి కోట్లు కేటాయింపు
గతనెలలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు వాటిల్లిన వరద నష్టానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు చెరో వెయ్యి కోట్లు కేటాయించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రెండు లక్షలు, గాయపడిన వారికి యాభై వేలు చొప్పున మంజూరు చేసినట్లు తెలిపింది.