: ప్రైవేటు బస్సులపై కొనసాగుతున్న రవాణాశాఖ దాడులు


మహబూబ్ నగర్ జిల్లా పాలెం దగ్గర జరిగిన వోల్వో బస్సు ప్రమాదంతో మొదలైన రవాణాశాఖ అధికారుల దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు చేపట్టిన తనిఖీల్లో నిబంధనలను ఉల్లంఘించి తిరుగుతోన్న 23 బస్సులను అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ ఎల్బీనగర్ వద్ద 14, నాగ్ పూర్ జాతీయ రహదారిపై 4, విజయవాడలో 6 బస్సులను సీజ్ చేశారు. దీంతో, రాష్ట్ర వ్యాప్తంగా పది రోజులగా జరుగుతున్న దాడుల్లో సీజ్ చేసిన బస్సుల సంఖ్య 478కి చేరింది. బస్సుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకంటామని అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News