: త్వరలో భారత్-చైనా సంయుక్త సైనిక విన్యాసాలు


ఆసియాలో అతిపెద్ద సైనిక పాటవం కలిగిన దేశాలుగా చైనా, భారత్ తమ పోరాట పటిమకు మరింత పదును పెట్టేందుకు సంయుక్తంగా నడుంకట్టాయి. త్వరలోనే సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. కాగా, ఈ నెల చివరి వారంలో విన్యాసాలు ఎప్పుడు నిర్వహించేది ప్రకటించనున్నారు.

ఈమేరకు చైనా సైనికాధికారులు భారత రక్షణ శాఖ అధికారులతో ఢిల్లీలో సమావేశమై తేదీలను నిర్ణయిస్తారు. చైనా సైన్యం ప్రపంచంలోనే అతి పెద్దది కాగా, భారత్ మూడోది. ఇరు దేశాల సైనికుల నైపుణ్యం పెంపుదలకు ఈ విన్యాసాలు తోడ్పడతాయని భావిస్తున్నారు. ప్రధానంగా యాంటీ హైజాక్, యాంటీ టెర్రర్ ఆపరేషన్లు నిర్వహించడంలో ప్రావీణ్యత సాధించేందుకు వీలుగా ఈ విన్యాసాలకు రూపకల్పన చేశారు. 

  • Loading...

More Telugu News