: హిందీ వెబ్ సైట్ ను ప్రారంభించిన యూఎస్ బాస్కెట్ బాల్ టీం


అమెరికాలోని ప్రముఖ బాస్కెట్ బాల్ టీం 'శాక్రమెంటో కింగ్' తన వెబ్ సైట్ ను హిందీ వర్షన్ లో ప్రారంభించింది. హిందీ మాట్లాడే అభిమానులకు దగ్గరవడం కోసం ఈ వర్షన్ ను ప్రారంభించినట్టు టీం మేనేజ్ మెంట్ ప్రకటించింది. ఈ టీంలో మెజారిటీ వాటాను భారతీయ సంతతి అమెరికన్ వివేక్ రణదివే సొంతం చేసుకున్నారు. భారతదేశంలో బాస్కెట్ బాల్ క్రీడకు మరింత ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు ఈ వెబ్ సైట్ ఉపయోగపడుతుందని వివేక్ తెలిపారు.

  • Loading...

More Telugu News