: హైదరాబాద్ ను యూటీ చేయాలి : సీమాంధ్ర న్యాయవాదులు


ఆర్టికల్ 371 డి రద్దుచేయడం కుదిరేపని కాదని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ సీవీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ శనివారం కాకినాడలో సమావేశమైంది. ఈ సందర్భంగా సీవీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగంలో ఉమ్మడి రాజధాని అనే పదమే లేదని ఆయన అన్నారు. అందువల్ల హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయపరమైన సమస్యలు వస్తాయని తెలిపారు. రాష్ట్రపతి పాలన అనేది సరైన నిర్ణయం కాదని ఆయన సూచించారు. అలాగే సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 23 వరకు సమ్మె కొనసాగుతుందని సీమాంధ్ర న్యాయవాద జేఏసీ ప్రకటించింది. ఉద్యమ కార్యాచరణ ఈ నెల 23న కడపలో నిర్ణయిస్తామని వారు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News