: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరాం: శైలజానాథ్
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రధానిని కోరినట్లు మంత్రి శైలజానాథ్ తెలిపారు. ఢిల్లీలో ప్రధానితో భేటీ అనంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అన్ని ప్రజాస్వామ్య మార్గాలను అనుసరిస్తున్నామని అన్నారు. విభజన ప్రయత్నాలను అడ్డుకునేందుకు వచ్చే ఏ అవకాశాన్ని తాము వృధా చేసుకోమని శైలజానాథ్ స్పష్టం చేశారు.