: కాశ్మీరు లోయలో దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
చలిపులి కాశ్మీరు లోయను వణికిస్తోంది. శీతాకాల ప్రారంభంలోనే అక్కడి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. కాశ్మీర్ లోని లేహ్ ప్రాంతంలో రాత్రి ఉష్ణోగ్రతలు మైనస్ 5.2 డిగ్రీలకు పడిపోయాయి. అలాగే మంచు ఎడారిగా పిలువబడే లడఖ్ లో ఉష్ణోగ్రతలు మైనస్ 4.2 డిగ్రీలుగా నమోదయ్యాయి. కార్గిల్ లో మైనస్ 4 డిగ్రీలు, గుల్మార్గ్ లో మైనస్ 3.8 డిగ్రీలు, పహల్ గామ్ లో మైనస్ 3.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర రాజధాని (వేసవికాలం) శ్రీనగర్ లో రాత్రి ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలకు పడిపోయాయి. ఈ వివరాలను వాతావరణ శాఖ ప్రకటించింది.