: హైదరాబాదులో సీమాంధ్రులు బతికే పరిస్థితి లేదు : కిశోర్ చంద్రదేవ్


రాష్ట్ర విభజన ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసిన నేపథ్యంలో, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ లేఖ రాశారు. హైదరాబాదులో తెలంగాణేతరులు బతికే పరిస్థితి లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. సీమాంధ్రుల రక్షణకు పూర్తి భరోసా కల్పించాకే విభజనపై ముందుకు వెళ్లాలని సూచించారు. తెలంగాణేతరుల ఆస్తులకు భద్రత కల్పించాలని కోరారు. విభజన ప్రకటన వెలువడ్డాక హైదరాబాదులో ఉంటున్న తెలంగాణ, సీమాంధ్రుల మధ్య విభేదాలు తలెత్తాయని వివరించారు. దాంతో, హైదరాబాదులో స్థిర పడిన సీమాంధ్రులలో రోజురోజుకూ భయాందోళనలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. విభజన అనంతరం విశాఖపట్టణాన్ని రాజధానిగా ప్రకటించాలని లేఖలో డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News