: సోనాక్షి మీద సల్మాన్ గుర్రు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటి సోనాక్షి సిన్హాపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. సల్మాన్ తన సోదరుడు అర్బాజ్ ఖాన్ తీయబోయే తదుపరి చిత్రంలో సోనాక్షిని తీసుకోవాలని సూచించారు. దీంతో అర్బాజ్ సోనాక్షిని సంప్రదించగా.. కారణమేంటో గానీ ఆమె ఒప్పుకోలేదు. సోనాక్షి తీరుతో సల్మాన్ అసంతృప్తికి గురైనట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.