: తెలుగు సినీ రంగం చిరునవ్వును కోల్పోయింది: దాసరి


తెలుగు సినీరంగం చిరునవ్వును కోల్పోయిందని మాజీ కేంద్ర మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణరావు తెలిపారు. ఏవీఎస్ కొన్ని వందల సినిమాల్లో నటించి నవ్వించి, మెప్పించి అనంతలోకాలకు వెళ్లిపోయారని బాధాతప్త హృదయంతో పేర్కొన్నారు. ఫిలిం ఛాంబర్ లో ఉంచిన ఏవీఎస్ భౌతిక కాయాన్ని సందర్శించిన అనంతరం దాసరి మాట్లాడుతూ ఏవీఎస్ వెళ్లిపోయినా ఆయన నవ్వులు మనతోనే ఉంటాయని అన్నారు. తెలుగు సినీరంగం ఓ మంచి మనిషిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏవీఎస్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • Loading...

More Telugu News