: ఏడేళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడి అత్యాచారయత్నం
70 ఏళ్ల ముసలోడి బుద్ధి పాడుదారి పట్టింది. ముని మనవరాలి వయసున్న బాలికపై అత్యాచారానికి యత్నించాడు. నాగ్ పూర్ లోని రోజ్ కాలనీలో ఏడేళ్ల బాలికపై గోపాల్ కనోజియా అనే వృద్ధుడు అత్యాచారానికి యత్నించగా స్థానికులు బడితెపూజ చేసి పోలీసులకు అప్పగించారు. కనోజియా లాండ్రీ షాపు నడుపుతున్నాడని, డ్రెస్ తీసుకెళ్లడానికి వచ్చిన బాలికపై అత్యాచారానికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు.