: శ్రీవారి సేవలో సెహ్వాగ్
ఇటీవల తరచుగా విఫలమవుతున్న భారత్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నాడు. శ్రీవెంకటేశ్వరుని సుప్రభాత సేవలో పాల్గొన్న సెహ్వాగ్ ఆ తర్వాత తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివెళ్లాడు. కాగా, సెహ్వాగ్ తిరుమల పర్యటన వివరాలను అధికారులు ఎక్కడా బయటికి పొక్కనీయలేదు.