: ఏవీఎస్ భౌతిక కాయం ఫిలిం ఛాంబర్ కు తరలింపు
అభిమానుల సందర్శనార్థం ఏవీఎస్ భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్ కార్యాలయానికి తరలించారు. ఏవీఎస్ భౌతిక కాయాన్ని టీడీపీ ఎంపీలు నామానాగేశ్వరరావు, సుజనా చౌదరి, సినీ నటులు పరుచూరి వెంకటేశ్వరరావు, కోట శ్రీనివాసరావు సందర్శించి నివాళులర్పించారు. ఎవీఎస్ మరణంపై తెలుగు చిత్ర పరిశ్రమ, సినీ నటులు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు పంజాగుట్ట శ్మశాన వాటికలో ఏవీఎస్ అంత్యక్రియలు జరుపనున్నారు.