: సీమాంధ్ర న్యాయవాద సంఘాల నేతల సమావేశం
సమైక్యాంధ్ర కోసం ఆందోళన చేస్తున్న సీమాంధ్ర న్యాయవాద సంఘాల నేతలు ఈ రోజు కాకినాడలో సమావేశం కానున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జూలై 30 నుంచి 13 జిల్లాల న్యాయవాదులు విధులను బహిష్కరించి ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం వరకు వివిధ దశల్లో తమ ఆందోళన పొడిగిస్తూ వచ్చిన న్యాయవాద సంఘాల నేతలు భవిష్యత్ కార్యచరణపై నేడు నిర్ణయం తీసుకోనున్నారు. గుంటూరులో న్యాయవాదులు విధుల బహిష్కరణ కొనసాగించాలని తీర్మానించారు.