: 11 దుకాణాల్లో ఒకేసారి దొంగతనం


గుంటూరు జిల్లాలో దోపిడీ దొంగలు విరుచుకుపడుతున్నారు. నిన్న రేపల్లె, నేడు కొల్లూరులో దొంగలు స్వైరవిహారం చేశారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కొల్లూరు ప్రధాన రహదారిపై ఉన్న 11 దుకాణాల్లో ఒక్కసారిగా దొంగతనానికి పాల్పడ్డారు. షట్టర్లు వంచి దుకాణాల్లోకి ప్రవేశించిన దొంగలు లక్షరూపాయల నగదు దొంగిలించారు. కాగా బంగారం, వస్త్ర దుకాణాల్లోనే దోపిడీకి పాల్పడ్డ దొంగలు నగదు మినహా మరే వస్తువులు ముట్టకపోవడం విశేషం. ఈ చోరీలు బీహార్ దొంగల పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News