: అమ్మాయిలకు ఏరోబిక్స్‌ మంచిది


ఏరోబిక్స్‌ చేయడం ఎవరికైనా మంచిదే కదా... మరి అమ్మాయిలకే ఎందుకు మంచిది అనుకుంటున్నారా... అమ్మాయిలు సహజంగా తమ శరీరాకృతిపై చాలా శ్రద్ధ చూపుతుంటారు. ఇందుకోసం కడుపు మాడ్చుకుని మరీ ప్రయత్నిస్తుంటారు. అందుకే అమ్మాయిల శరీరాకృతిని చక్కగా మలచడంలో ఉపయోగపడే వాటిలో ఏరోబిక్స్‌ మరింత మేలు చేస్తుంది.

వేగంగా ఏరోబిక్స్‌ చేయడం వల్ల టీనేజ్‌ అమ్మాయిల్లో పేరుకుపోయే కొవ్వును దూరం చేస్తాయట. ఈ విషయంపై యూనివర్సిటీ ఆఫ్‌ పిట్స్‌బర్గ్‌ ప్రత్యేక అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం ప్రకారం ప్రస్తుత కాలంలో టీనేజ్‌ అమ్మాయిల్లోనే ఊబకాయం, మధుమేహం, ఫ్యాటీ లివర్‌ సమస్యలు ఎక్కువగా ఉన్నాయట. వీటిని తగ్గించడంలో వ్యాయామాల పాత్ర విషయంలో పరిశోధన చేయగా పెద్దగా ఒత్తిడి లేకుండా వేగంగా చేసే ఏరోబిక్స్‌ మగువలకు ఎంతో మేలు చేస్తుందని తేలిందట. కాబట్టి చక్కగా సంతులిత ఆహారం తీసుకుంటూ ఏరోబిక్స్‌ చేస్తూ ఉండడం వల్ల అమ్మాయిలు నాజూకైన శరీరాకృతిని సొంతం చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News