: అందాల రాణి అంటూ పొగిడి...


నువ్వు గొప్ప అందాల రాణివి... అంటూ ఆకాశానికి ఎత్తేశారు. చక్కగా అందాల రాణి కిరీటాన్ని అలంకరించారు. ఆ కిరీటం చాలా గొప్పదని అందరూ అనుకొన్నారు. అయితే అది ఉత్తదేనని తేలింది. మిస్‌ ఆసియా పసిఫిక్‌గా విజయం సాధించిన అందాల రాణి కిరీటం గాజుతో తయారుచేసిందని, అందులో ఉన్నవి నకిలీ వజ్రాలని అధికారులు తేల్చేశారు.

సృష్టి రాణా అక్టోబరు 30న బూసాన్‌లో మిస్‌ ఆసియా పసిఫిక్‌ విజేతగా నిలిచింది. ఈ అందాల రాణి విజయానంతరం స్వదేశానికి చేరుకునే క్రమంలో సరైన పత్రాలు లేని కారణంగా రాణి వద్దనున్న కిరీటాన్ని ముంబై విమానాశ్రయంలోని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఆ కిరీటం విలువను తెలుసుకోవడానికి దాన్ని పరీక్షించగా అది నకిలీదని, గాజుతో తయారయ్యిందని బయటపడింది. అందాల రాణివంటూ ఆకాశానికి ఎత్తేసి చివరికి గాజు కిరీటం పెట్టి పోటీ నిర్వాహకులు చేసిన మోసం ఇలా బయటపడింది.

  • Loading...

More Telugu News