: బాలుడి నిజాయతీ
తనది కాని సొమ్మును తాను తీసుకోకూడదు అనే సూత్రాన్ని చక్కగా పాటించాలని భావించిన ఒక పదమూడేళ్ల బాలుడు తనకు రోడ్డుపై దొరికిన సొమ్మును సదరు సొమ్ము యజమానికి అందజేసి అందరి మన్ననలను పొందాడు.
మసాచుసెట్స్‌లోని సాండ్‌విచ్ పట్టణంలో జాక్ షిహన్ అనే బాలుడికి రోడ్డుపై రూ.18 వేలు ఉన్న ఒక సంచి దొరికింది. ఆ సంచిలో సొమ్ముతోబాటు కొన్ని పత్రాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని ఆ బాలుడు తన తల్లికి చెప్పి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సదరు పత్రాల ఆధారంగా సొమ్ము యజమాని గురించి విచారించి సొమ్మును పోగొట్టుకున్న వారికి తిరిగి అప్పగించారు. రోడ్డుపై పోతుంటే దొరికిన సొమ్మును చక్కగా స్వంతం చేసుకునేందుకే చాలామంది ప్రయత్నిస్తారు. అలాంటిది దొరికిన సొమ్మును యజమానికి అందజేసిన జాక్ నిజాయతీని అందరూ మెచ్చుకుంటున్నారు. సొమ్ముకు సంబంధించినవారు జాక్‌కు కృతజ్ఞతలు తెలిపారు.