: ప్రముఖ సినీ నటుడు ఏవీఎస్ ఇక లేరు


కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తీవ్ర అస్వస్థతకు గురైన ప్రముఖ నటుడు ఆమంచి వెంకట సుబ్రమణ్యం(56) (ఏవీఎస్ ) 8.13 గంటలకు హైదరాబాద్ మణికొండ లోని ఆయన స్వగృహంలో కన్ను మూశారు.

ఏవీఎస్ కు గతంలో కాలేయ మార్పిడి చికిత్స జరిగింది . ఆయన కుమార్తె కాలేయంలోని కొంత భాగాన్ని తన తండ్రికి దానం చేయటంతో ప్రాణాపాయం నుంచి అప్పుడు బయటపడ్డారు. అయితే 10 రోజుల క్రితం మరల ఆయన ఆరోగ్యం విషమించడంతో గ్లోబల్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో వైద్యుల సూచన మేరకు సాయంత్రం ఏవీఎస్ ను ఆయన కుటుంబ సభ్యులు మణికొండలోని స్వగృహానికి తరలించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News