: ముగిసిన వార్ రూం సమావేశం
కాంగ్రెస్ వార్ రూంలో రెండు గంటలపాటు సాగిన కాంగ్రెస్ సమన్వయకమిటీ సమావేశం ముగిసింది. సమావేశం నుంచి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్శింహ బయటకు వచ్చారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్టు సమాచారం. సమావేశంలో దిగ్విజయ్ సింగ్, తిరునావుక్కరసు, సీఎం కిరణ్, డిప్యుటీ సీఎం దామోదర, పీసీసీ చీఫ్ బొత్స, కేంద్ర మంత్రి చిరంజీవిలు పాల్గొన్నారు.