: బాగ్దాద్ లో జంట పేలుళ్లు.. ముగ్గురి మృతి


ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో ఈ మధ్యాహ్నం జరిగిన జంట బాంబు పేలుళ్లలో ముగ్గురు మరణించగా పదిమంది గాయపడ్డారు. రోడ్డు ప్రక్కనే రెండు బాంబులు సఫార్తర్ జిల్లాలోని అలీ మసీదు సమీపంలో పేలాయి. పశ్చిమ బాగ్దాద్ లోని ఈ ప్రాంతంలో ఎక్కువగా సున్నీ తెగకు చెందిన ముస్లింలు ఉంటారని పోలీసులు చెబుతున్నారు. శుక్రవారం ఇమాంఅలీ మసీదులో ప్రార్థనలు చేసి బయటకు వస్తున్న ముస్లింలను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరిగాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జరిగిన బాబు పేలుళ్లలో ఏడు వేల మంది ఇరాకీలు మరణించగా 16 వేల మందికి పైగా గాయపడ్డారు.

  • Loading...

More Telugu News