: హాట్ హాట్ గా కొనసాగుతున్న కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం
రాష్ట్ర విభజన రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఆరు గంటల సమయంలో సమావేశమైన కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం కొనసాగుతోంది. నలభై నిమిషాల నుంచి సమావేశం జరుగుతోంది. రాష్ట్ర విభజన విషయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ కు ఉన్న అనుమానాలు, అభిప్రాయ భేదాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, నాలుగు రోజుల్లో జరగనున్న అఖిలపక్ష భేటీపైన చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశం తర్వాత విభజనపై కాంగ్రెస్ ఓ స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.