: ఢిల్లీ బయలుదేరి వెళ్లిన మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ రోజు మధ్యాహ్నం సమయంలో ఆయన ఢిల్లీ వెళ్లారని హైదరాబాదులోని ఆయన కార్యాలయం తెలిపింది. అయితే, విభజన విషయంలో విధానపరమైన నిర్ణయాలపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించేందుకే శ్రీధర్ బాబు హస్తిన వెళ్లినట్లు సమాచారం. అయితే, అధిష్ఠానం పిలుపు మేరకే రాజధానికి వెళ్లినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.