: వాయుగుండంగా మారిన అల్పపీడనం 08-11-2013 Fri 18:46 | అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ఆగ్నేయ దిశగా పయనించి సోమాలియా వద్ద తీరం తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.