: పుణ్యక్షేత్రం షిర్డీలో తాగునీటి కష్టాలు.. తక్షణ చర్యలు చేపట్టిన ట్రస్టు


ఇంకా వేసవికాలం మొదలుకాలేదు.. అప్పుడే పుణ్యక్షేత్రం షిర్డీలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. దీంతో భక్తుల తాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు షిర్డీ సంస్థాన్ ట్రస్టు తక్షణ చర్యలు చేపట్టింది. రోజుకు లక్ష రూపాయలు ఖర్చుచేసి తాగునీటిని కొనుగోలు చేయాలని ట్రస్టు నిర్ణయించింది.

ఈ క్రమంలో సాయిబాబా దేవస్థానానికి, భక్తుల వసతి గృహాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయిస్తోంది. షిర్డీకి మంచినీరు సరఫరా చేసే నాసిక్ దర్నా జలాశయంలో నీటి నిల్వలు అడుగంటడంవల్లే ఈ పరిస్థితి నెలకొందని ట్రస్టు వర్గాలు తెలిపాయి. 

  • Loading...

More Telugu News